BREAKING
సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు స్టార్‌లింక్ పరికరాల మంటల కేసు.. బల్గేరియా అభ్యర్థనపై విచారణ జరుపుతున్న జర్మనీ కోర్టు

పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి

Select Suryaa Now
పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి

వనిగడ్డ,మేజర్ న్యూస్: ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు పునరావాస కేంద్రాలను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు బుధవారం సందర్శించారు. అవనిగడ్డ బాలికల ఉన్నత పాఠశాల, నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు గుల్లలమోద, ఏటిమొగ గ్రామాల్లోని పునరావాస కేంద్రాలను పరిశీలించి, బాధితులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు.

కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. చిన్నారులు, వృద్ధులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బాధితుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ఆహార పంపిణీ, ఇతర సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విక్కుర్తి సూచించారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఇళ్లకు తిరిగి వెళ్లాలని బాధితులకు విజ్ఞప్తి చేశారు.