ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం
- గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి
-బిజెపి నేత, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
లక్ష్మీదేవిపల్లి,(సూర్య) - రాష్ట్రంలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బిజెపి నేత, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి మండలం నుండి భారతీయ జనతా పార్టీ 1000 మంది గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల కో కన్వీనర్ వన్నాల వెంకటరమణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ఈ జిల్లా నుండి వెళ్తున్నా కూడా ఇక్కడి స్థానికంగా ఉన్న మండలాలకు నీరు అందించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా సాగునీరు అందించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు మంత్రులు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. ఇందుకుగాను ప్రతి కార్యకర్త కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అంజి రెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రమాణం చేయిస్తూ ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ విజయానికై కృషి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలు సెమీఫైనల్ లాంటివని, భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి దిశా నిర్దేశం చేశారు.ఈ ఎన్నికలలో ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు ఉండదని, భారతీయ జనతా పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని కార్యకర్తలకు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా రోజురోజుకు బలం పెంచుకుంటుందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాబోవు అన్ని ఎన్నికలలో గెలుస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి కృష్ణ, డాక్టర్ జాటోత్ వెంకన్న, పుణ్యం బిక్షపతి, చెరుకు భాగ్యలక్ష్మి, భూక్య దివ్యశ్రీ, జిల్లా కోశాధికారి ముకుంద రెడ్డి, జిల్లా కార్యదర్శి పుణ్యానాయక్, రఘురాం, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు జుజ్జూరు మోహన్, కృష్ణ, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్ కుమార్, బలగం శ్రీధర్, రాపాక రమేష్, శంభు నాయక్, బట్టు రమేష్, సుచిత్రపాసి, నాయిని శ్రీను, ముసుకు శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రహీం, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.