కిష్టాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే సందర్భంగా అవగాహన సమావేశం
తూప్రాన్;తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే సందర్భంగా గ్రామంలో కులవివక్ష, సామాజిక అసమానతల నిర్మూలన, సమాన హక్కులు మరియు సామాజిక సామరస్యంపై అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా తూప్రాన్ డీఎస్పీ శ్రీ నరేంధర్ గౌడ్, హాజరై మాట్లాడుతూ, సమాజంలో కులం, మతం ఆధారంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ, ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని తెలిపారు. గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.అలాగే గ్రామంలో అన్ని కులాల ప్రజలు పరస్పర గౌరవం, ఐకమత్యం, సోదరభావంతో మెలగాలని, గ్రామాభివృద్ధి మరియు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సమావేశంలో తూప్రాన్ ఎస్ఐ వి. గంగరాజు, ఎస్ఐ మధుసూదన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, ఎస్సీ కమ్యూనిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ కులాలకు చెందిన గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులందరూ గ్రామంలో కులవివక్ష, సామాజిక అసమానతలకు తావులేకుండా, అన్ని వర్గాల ప్రజలు సమానంగా గౌరవించబడే విధంగా పరస్పర సహకారంతో వ్యవహరిస్తామని, గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ ఐకమత్యంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై గంగరాజు, డిప్యూటీ తాసిల్దార్ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ గ్రామ సర్పంచ్ హిమబిందు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,