31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ
తిరుపతి, మేజర్ న్యూస్:
నగరపాలక సంస్థ పరిధిలోని 31 వ డివిజన్ లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ ప్రచారం విస్తృతంగా చేపట్టారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి కార్పొరేటర్ గా గెలిపిస్తే మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని డివిజన్ ప్రజలను ఓటర్లను జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ కోరారు. గురువారం
భానుప్రియ తో పాటు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆమె గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 31 డివిజన్ పరిధిలోని అన్ని వీధులలో మూడు పర్యాయాలు ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. డివిజన్ పరిధిలో ఎవరి నోట విన్న మందపాటి భానుప్రియ గాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని పలుకుతున్నారు. మీ అందరికీ అందుబాటులో ఉండి ఒక సోదరిగా, మీ ఇంటి అడ్డుపడుచు గా అభివృద్ధి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని పేర్కొన్నారు . తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే రానున్న రోజుల్లో డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపుతానని ఓటర్లకు, డివిజన్ లోని ప్రజలకు హామీ ఇచ్చారు. జనసేన నాయకుడు సతీష్ యాదవ్, మధుసూదన్, రేఖ, గోవిందా చారి, మధు ఆచారి, సురేష్, రాజేష్, విజయలక్ష్మి, ఉదయగిరి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter
Cell no 9705347341