BREAKING
ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ రంగంలో కీలక పరిణామం..సబ్సిడీల నిబంధనలు సడలించిన జర్మనీ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు

పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి

Select Suryaa Now
పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి

 

పలమనేరు మేజర్ న్యూస్ 

పలమనేరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని 13, 14, 32వ వార్డుల్లో ఆమె పర్యటిస్తూ కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, పట్టణ అభివృద్ధిపై తన ఆలోచనలను ప్రజలకు వివరించారు. పట్టణంలో

ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్ఫూర్తితో పలమనేరు పట్టణాన్ని కూడా ప్రగతి బాటలో నడిపించాలన్నదే తన సంకల్పమని రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి సహకారంతో, కూటమి నాయకుల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో

సమయంలో ఇచ్చే హామీలకే పరిమితం కాకుండా, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందించాలన్నదే తన అభిమతమని ఆమె వివరించారు. పట్టణ ప్రజలు అభివృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని తనకు, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ప్రచార కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓటర్లను కలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

 

 రిపోర్టర్: అనిల్ కుమార్ యాదవ్