జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ : నెల్లూరు నగర 21వ డివిజన్ కార్పొరేటర్ గా గునుకుల విజయలక్ష్మి రెడ్డి నీ, సైకిల్ గుర్తుకు ఓటు వేసి నగర మేయర్ గా పొలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని కోరుతూ, మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీలో గునుకుల విజయలక్ష్మి రెడ్డి తో వారు ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను ఆదరించాలని ప్రజలను అభ్యర్థించారు. స్థానికులు తమ మద్దతును తెలియజేయడంతో ర్యాలీ సందడిగా సాగింది. 2028 నాటికి నెల్లూరు నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ, అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ప్రజల సహకారం అవసరమని నాయకులు పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. జనసేన నాయకులు కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు..