ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బందెల వెంకటరమణ..
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరులో మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారిని ఇందుకూరుపేట మండల వైసీపీ నూతన అధ్యక్షులు బందెల వెంకటరమణ గారు నేడు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమించినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో APLDA చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, వైసీపీ నాయకులు తాతా సురేంద్ర, పురుషోత్తం ప్రతాప్, రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు