డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
రేణిగుంట మేజర్ న్యూస్: అమర రాజా గ్రూప్ ఆధ్వర్యంలో కరకంబాడి తయారీ ప్లాంట్‌లో బుధవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఎస్‌వీ అరవింద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం సుమారు 200 మంది డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసింది. డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణ, రహదారి భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 30న చిత్తూరులోని అమర రాజా గ్రోత్ కారిడార్‌లోనూ ఈ శిబిరం నిర్వహించనున్నారు.