BREAKING
ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు స్టార్‌లింక్ పరికరాల మంటల కేసు.. బల్గేరియా అభ్యర్థనపై విచారణ జరుపుతున్న జర్మనీ కోర్టు తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!

యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ

Select Suryaa Now
యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం  -  అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    బొమ్మిరెడ్డి వంశ యువ నేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్, దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మనుమడు, దివంగత  నేత డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు,  ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. బుధవారం  ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో, పట్టణ శివార్లలోని అనంతరాయుని ఏని తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఆయా వార్డుల కౌన్సిల్ అభ్యర్థులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అశేష జనం ఆయనకు అఖండ స్వాగతం పలికి మంగళ హారతులు ఇస్తూ శాలువాలు పూలమాలలతో సన్మానాలు చేస్తూ స్వాగతం పలికి విశేషంగా ఆదరించారు.రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆయన ఆహ్వానం మేరకు తెలుగుదేశంలో చేరి వైద్య సేవలతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలు కూడా అందించాలన్న లక్ష్యంతో ఆత్మకూరు అభివృద్ధి ఏకైక అజెండాగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పోటీ చేస్తున్నారని ఆమెను అందరూ ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని తారకనాథరెడ్డి ఇంటింటికి వెళ్లి అందర్నీ కోరారు. ఆయన ప్రచారంలో విశేష స్పందన లభించింది. అన్ని వర్గాల నుండి అశేష ప్రజాదరణ లభించింది. బొమ్మిరెడ్డి కుటుంబం అందించిన, అందిస్తున్న వైద్య సేవలు, సామాజిక సేవలు, ప్రజాసేవలను అందరూ గుర్తు చేసుకుంటూ ఆత్మకూరు మున్సిపాలిటీ అనూహ్యంగా అభివృద్ధి పరుస్తున్న ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మిరెడ్డి షకీలా నాయకత్వంలో ఆత్మకూరు మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధి చెందగలదని సర్వత్ర అభిప్రాయపడుతూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అనంతరాయుని ఏని లో గిరిజనుల సమస్యలను తారక్ నాథ్ రెడ్డి అడిగితెలుసుకున్నారు. అన్నింటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిచ్చి కృషి చేస్తామని తారక్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులు, తెలుగుదేశం నాయకులు తోట సందీప్,కూటమి నాయకులు  తదితరులు పాల్గొన్నారు.