BREAKING
కిష్టాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే సందర్భంగా అవగాహన సమావేశం ఇరాన్‌తో వైద్యపరమైన వస్తువుల సరఫరాపై చర్చలు.. ఉపాధ్యక్షుడు వాన్స్ రాయబారం పోలీసు కుటుంబాలకు అండగా పల్నాడు జిల్లా ఎస్పీ కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం.

వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం

Select Suryaa Now
వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా  ప్రచారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్:   కూటమి ఆధ్వర్యంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ షకీలా, 3వ వార్డు కూటమి ఆధ్వర్యంలోని బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి నలిశెట్టి శ్రీనివాసులు బుధవారం వార్డు పరిధిలోని వీవర్స్ కాలనీలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డితో కలిసి వారు వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల విశేషాధరణ లభిస్తుండడం తో వారు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆయా వార్డుల్లో మహిళలు మంగళ హారతులతో, జనాలు పూలమాలలు శాలువాలతో సన్మానిస్తూ అఖండ స్వాగతం పలుకుతూ చిరకాలంగా సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి సేవలను తాము గుర్తిస్తున్నామని, చైర్ పర్సన్ గా బొమ్మిరెడ్డి షకీలా కు, 3వ వార్డు బిజెపి అభ్యర్థి నలిశెట్టి శ్రీనివాసులు కు సంపూర్ణ మద్దతు ఇస్తామని, వారి విజయం సంకల్పంగా భావిస్తామని సర్వత్రా పేర్కొంటున్నారు.దాదాపు 40 సంవత్సరాలుగా బొమ్మిరెడ్డి కుటుంబఅగ్రజుడు డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి మూడు దపాలు శాసనసభ్యులుగా ప్రజలకు సేవలు అందించడంతోపాటు, తుదిశ్వాస విడిచే వరకు పేదల వైద్యుడిగా పేరుగాంచి వైద్య సేవలు అందించారు. ఆయన కుమారుడు, షకీలా భర్త అయిన బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆత్మకూరు మండలాధ్యక్షుడుగా, ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ గా, జిల్లా టెలికం సభ్యులుగా, ఆత్మకూరు ఆర్టిసి నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా అన్ని వర్గాల ప్రజలకు, కార్మికులకు విశేష సేవలు అందించారు. డాక్టర్ షకీలా బి ఎస్ ఆర్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలందించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఆమె నిర్వహించారు. ఆమె తనయుడు, యువ నేత బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి బిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గా అనేక సామాజిక సేవలను అందించారు. దాంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా నాడు,నేడు ఆత్మకూరు అభివృద్ధికి అనూహ్యంగా  కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనం అభివృద్ధి, బొమ్మిరెడ్డి కుటుంబం అందించిన సేవలు వెరసి డాక్టర్ షకీలా కు అనూహ్య  ప్రజాదరణ లభిస్తుంది. విజయ పదం వైపు దూసుకెళుతుందని సర్వత్ర అభిప్రాయపడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో డాక్టర్ షకీలా తో పాటు ఆనం కైవల్యా రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ బిజెపి అభ్యర్థి నలిశెట్టి శ్రీనివాసులు,సీనియర్ బిజెపి నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి, బిజెపి నాయకుడు సుసర్ల శ్రీనివాసులు, బిజెపి,తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.