వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
నెల్లూరు, మేజర్ న్యూస్ : 17వ డివిజన్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి భారీగా తరలివచ్చి.. అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలు. నెల్లూరు మంగమూరి వారి వీధి, సరస్వతి నగర్, కోదండ రామాపురం ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, 17వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి గొడ్లవేటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో అభ్యర్థులు ఫ్యాను గుర్తును.. ప్రదర్శిస్తూ నెల్లూరు నగర మేయర్ గా ఆనం విజయ కుమార్ రెడ్డి ని, 17వ డివిజన్ కార్పొరేటర్ గా గొడ్లవేటి వెంకటేశ్వర్లు ని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంచివాళ్ళైనా. ఆనం విజయకుమార్ రెడ్డి ని, వెంకటేశ్వర్లు గారిని ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థించారు. మంచివాళ్లు కార్పొరేషన్ లో ఉంటే.. కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు శరవేగంగా జరగడంతోపాటు.. ప్రజలకు.. కార్పొరేషన్ ద్వారా మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. ఈరోజు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ లో దోచుకో.. దాచుకో అనే పరిస్థితి.. తాండవిస్తుందన్నారు.. మునిసిపల్ కార్పొరేషన్ అక్రమాలకు అడ్డాగా మారుస్తున్న వారిని.. ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఆనం కుటుంబం కార్పొరేషన్ లో.. అభివృద్ధిని పరుగులు పెట్టించిందని.. ప్రజలకు గుర్తు చేశారు. మళ్లీ ఆనం కుటుంబం నుంచి.. మేయర్ గా పోటీ చేస్తున్న ఆనం విజయకుమార్ రెడ్డి గారిని.. 17వ కార్పొరేటర్ గా పోటి చేస్తున్న గొడ్లవేటి వెంకటేశ్వర్లు ని గెలిపించుకుంటే.. నెల్లూరు నగర అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కూడా.. శరవేగంగా జరుగుతుందన్నారు. ఈరోజు కూటమినేతల పాల్పడుతున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని..ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. గతంలో కార్పొరేషన్ లో అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తీసుకున్న పాలనాపరమైన సంస్కరణలేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.