BREAKING
పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

సిపిఎం ఎంపీటీసీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి

Select Suryaa Now
సిపిఎం ఎంపీటీసీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి

శ్రీకాళహస్తిసూర్య ప్రతినిధి; తొట్టంబేడు మండలం; బోనుపల్లి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీ. చాముండేశ్వరి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడమే ఆమె ప్రధాన బాధ్యతగా పనిచేస్తారని పేర్కొన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీపీఎం తరపున ఎంపీటీసీగా ఎన్నికైన చాముండేశ్వరి ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటారని నాగరాజు అన్నారు. ప్రజా సమస్యలపై జరిగే పోరాటాల్లో ముందుండి, గ్రామ అభివృద్ధితోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేయడం ద్వారా ఎంపీటీసీ పదవికి సార్థకత చేకూర్చాలని ఆకాంక్షించారు. చాముండేశ్వరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న బోనుపల్లి ప్రజలకు, ఆమె ఎన్నికకు సహకరించిన వారందరికీ సీపీఎం తరపున వందవాసి నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య, ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి, పెనగడం గురవయ్య, వెంకటేష్, గురునాధం, రాజా తదితరులు పాల్గొన్నారు. 

 వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి