27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ప్రజలను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఈ డివిజన్‌కు నూకరాజు జ్యోతి ప్రియ కార్పొరేటర్‌గా వ్యవహరించారు. ఆమె హయాంలో డివిజన్ పరిధిలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మదన్ కుమార్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు, మదన్ కుమార్ రెడ్డికి స్థానికంగా ప్రజల మద్దతు లభిస్తోందని, ఆయన కార్పొరేటర్‌గా ఎన్నికవుతారనే ధీమాను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.