BREAKING
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో రికార్డు ధర.. యూపీ వారియర్జ్ సొంతం చేసుకున్న స్టార్ ఆల్‌రౌండర్ "స్థానిక ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల సంఘం విఫలం - కాకాణి" సూపర్‌సిక్స్ హామీలన్నీ మోసమే: వైకాపా యువనేత బుగ్గన అర్జున్‌రెడ్డి పాత్రికేయులు లేని సమాజం చీకటిమయం* *-రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం* పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి కర్నూలు 40 వ వార్డులో వైసీపీ ప్రచారం అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో మైలురాయికి అడుగు దూరంలో పేసర్ మంత్రి ఆనం ను కలిసిన ఎంపిటిసి మెంబర్ బ్రాహ్మణపల్లెలో టీడీపీ ముమ్మర ప్రచారం అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు! బ్లక్‌సీలో వాణిజ్య నౌకలపై దాడులు తగవు....రష్యా, ఉక్రెయిన్‌లను హెచ్చరించిన టర్కీ పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి

అభివృద్ధి చేశాం.. ఆదరించి గెలిపించండి! కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

Select Suryaa Now
అభివృద్ధి చేశాం.. ఆదరించి గెలిపించండి!  కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

పొదలకూరు,  మేజర్ న్యూస్ :   అభివృద్ధి చేశాం.. మరింత అభివృద్ధి చేసేందుకు ఆదరించి గెలిపించాలని టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పొదలకూరులోని టీపీ నగర్, కాకుమాని లేఅవుట్, శ్రీనివాస నగర్ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థి కలిచేటి ప్రభాకర్‌రెడ్డి, బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థి ఆదాల సుగుణ, బిట్‌-3 అభ్యర్థి ఖాదర్‌బాషా ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి టీడీపీకి అండగా నిలవాలని కోరారు.

స్థానిక సంస్థల్లోనూ సైకిల్ జోరు కొనసాగాలి..

గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలంటే స్థానిక సంస్థల్లోనూ టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, వీధిదీపాలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. పొదలకూరు మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ప్రచారంలో భాగంగా అభ్యర్థులు స్థానికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జమీర్, ఆదాల మురళి, ఆశీర్వాదం తదితరులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.