పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
అవనిగడ్డ మేజర్ న్యూస్: ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, ఇబ్బందులు తొలగించాలని వైసీపీ అభిమాని గౌతమ్ డిమాండ్ చేశారు. బుధవారం నాగాయలంక మండలం పాత ఉపకాలిలోని తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో లైట్లు, ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన గౌతమ్, అధికారులు వెంటనే జనరేటర్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. తుఫాన్ బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.