"స్థానిక ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల సంఘం విఫలం - కాకాణి"
వెంకటాచలం, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం పుంజులూరుపాడు, తోటపల్లి గూడూరు మండలం, సౌత్ ఆమలూరు గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దౌర్భాగ్యం. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో అభ్యర్థుల జాబితాలు ప్రకటించినప్పటికీ, నెల్లూరు జిల్లా పరిషత్ అభ్యర్థుల జాబితాను ఇప్పటివరకు ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? జిల్లా పరిషత్ అభ్యర్థుల ప్రకటన జాప్యం చేస్తున్న కొద్దీ ప్రజల్లో అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక పథకం ప్రకారం ఇప్పటివరకు ఉపసంహరించు కోని అభ్యర్థులను కూడా ఉపసంహరించుకునే విధంగా అవకాశం ఇచ్చి, అధికారులే ప్రోత్సహిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్‌లకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ప్రకటించినా, నెల్లూరు జిల్లా పరిషత్ కు మాత్రం, ప్రకటించకపోవడం లో ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితుల్లో, ప్రజలే అప్రమత్తంగా వ్యవహరించి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ కు సంబంధించి నిన్న సాయంత్రం మూడు గంటలకే పోటీలో ఉన్న అభ్యర్థులకు ఉపసంహరణ గడువు పూర్తయినా ఐదు గంటలకే జాబితా ప్రకటించాల్సి ఉంటే ఇప్పటివరకు అంటే దాదాపు (రాత్రంతా.. ఉదయం అంతా ప్రకటించకపోవడం వెనక అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయని, జిల్లా అధికారులు ఉద్దేశపూర్వకంగా, కొంతమంది అధికార పార్టీ నేతలు మా పార్టీ అభ్యర్థులను ఒత్తిడి చేసి విత్ డ్రా కోసం తీసుకొస్తామంటే, నిన్నటి తేది తో వారి దగ్గర నుండి ఉపసంహరణ లేఖలు తీసుకుని, వారిని ఉపసంహరించినట్లుగా చేయడానికి , ఈరోజు చేస్తున్నటువంటి పని వల్ల , పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల మీద ఒత్తిడి పెరిగి ఈరోజు ప్రజాస్వామ్యం అపహస్యపాలవుతుంది . రాష్ట్రంలో అన్ని దగ్గరలా అన్నిచోట్ల జిల్లా పరిషత్ కు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించినా, నెల్లూరు జిల్లా పరిషత్ కు సంబంధించి, ఆ అభ్యర్థుల జాబితా ఎందుకు ప్రకటించలేదో అర్థం కావడం లేదన్నారు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థులతో లావాదేవీలు జరుపుకొని వారి మీద ఒత్తిడి పెంచి ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి , బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని, పోటీలో ఉన్నటువంటి నామినేషన్లు ఉపసంహరించుకునే విధంగా, అధికారులు ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది,
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి, అనేక రకాల అపోహలు కనిపిస్తున్నాయి, అటువంటి నేపథ్యంలో ఈరోజు స్థానిక సంస్థలకు జరుగుతున్నటువంటి కీలక సమయంలో , ప్రభుత్వం అన్ని విధాలా అడ్డదారులు తొక్కుతుంటే , రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉండిపోయింది తప్ప, ఎక్కడ కూడా దానిని సరిదిద్దే పరిస్థితి లేదు, అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో కూడా, ఏదో మొక్కుబడిగా, తూతూ మంత్రంగా, వ్యవహరించి, చేతులు దులుపుకుంటున్నారు తప్ప, ప్రజలు సంపూర్ణంగా, వారి ఓటు హక్కు, సద్వినియోగ పరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు పోలీసు యంత్రాంగం అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మలా మారి, ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో 79 ఎంపీటీసీ, 5 జడ్పీటీసి స్థానాలు ఉన్నాయని, నా కుటుంబ సభ్యులు లాంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో నాకు అండగా నిలిచారు కాబట్టే , 79 ఎంపీటీసీ అభ్యర్థులు,, 5 జడ్పీటీసి అభ్యర్థులు, పోటీలో ఉంచగలిగాం , ఎన్నికలు సజావుగా జరిగితే , అధిక శాతం ఓట్లతో ,మెజారిటీ సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపారు.
ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందో అని, అధికార పార్టీ నేతల ఆదేశాలతో ఇష్ట రాజ్యాంగ పోలీసులు వ్యవహరిస్తూ, మావారిని ఇబ్బందులు పట్టే పరిస్థితి ఏర్పడింది, వీటిని దీటుగా ఎదుర్కొంటాం, అధికారుల అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎన్నికల నియమావలి ప్రకారం నడుచుకోవాలే తప్ప, మీ ఇష్టాను ప్రకారము వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోము, రాబోయేటటువంటి పరిస్థితుల్లో, గొడవలు జరిగి, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే, పోలీస్ యంత్రంగమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా ఎస్పీ కి, పోలీసు ఉన్నతాధికారులకు, నేను తెలియజేసేది ఇప్పటికైనా కింద స్థాయి పోలీస్ అధికారులకు , సూచనలు, సలహాలు ఇచ్చి, ఎక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టడం మానుకుంటే మంచిదని, లేని పరిస్థితుల్లో, పోరాటాలకు సిద్ధపడతామని, అటువంటి పర్యవసానాలకు జిల్లా యంత్రాంగం భాద్యత వహించి ఉండాల్సి ఉంటుందని తెలిపారు జిల్లాలో ఉన్న డి.ఎస్.పి, సీఐ స్థాయి అధికారులు ఏ విధంగా దళారులు లాగా వ్యవహరించి, ప్రజలను ఉదేశపూర్వకంగా ఏవిధంగా ఇబ్బందులు పెడుతున్నారో, విత్ డ్రాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారో చూస్తున్నాం.ఇకమీదట ఎవరైనా అధికారులు ఒత్తిడి తెస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కాకాణి పర్యటనలో భాగంగా పుంజులూరుపాడులో సోంపల్లి రాఘవులు నాయుడు గారికి, సౌత్ ఆమలూరు లో మద్దెన వెంకట సుబ్బనాయుడు గారి కి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు