BREAKING
సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు స్టార్‌లింక్ పరికరాల మంటల కేసు.. బల్గేరియా అభ్యర్థనపై విచారణ జరుపుతున్న జర్మనీ కోర్టు

సూపర్‌సిక్స్ హామీలన్నీ మోసమే: వైకాపా యువనేత బుగ్గన అర్జున్‌రెడ్డి

Select Suryaa Now
సూపర్‌సిక్స్ హామీలన్నీ మోసమే: వైకాపా యువనేత బుగ్గన అర్జున్‌రెడ్డి

డోన్ రూరల్ (): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన సూపర్‌సిక్స్ హామీలన్నీ పచ్చి మోసమని వైకాపా యువనేత బుగ్గన అర్జున్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం డోన్ పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అభివృద్ధి కొనసాగాలన్నా, డోన్ పట్టణాన్ని కాపాడుకోవాలన్నా వైకాపా అభ్యర్థులను ఆదరించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను పేరుపేరునా అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బోయ చైతన్య, కౌన్సిలర్ అభ్యర్థులు వడ్డే శ్రీనివాసులు, తలారి మద్దమ్మ, కుమ్మరి రామాంజనమ్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సూర్య ప్రతినిధి తారక్ నంద్యాల జిల్లా డోన్