BREAKING
ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ రంగంలో కీలక పరిణామం..సబ్సిడీల నిబంధనలు సడలించిన జర్మనీ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదాభార్గవి ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు

అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు!

Select Suryaa Now
అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు!

పొదలకూరు, మేజర్ న్యూస్ :    స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి విజయాన్ని కానుకగా అందించాలని పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి (చిన్ని) ప్రజలను కోరారు. బుధవారం పొదలకూరులోని ఎమ్మార్వో కాలనీలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆశీస్సులతో జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డితో పాటు పొదలకూరు బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థి గంగవరపు లక్ష్మీకళ్యాణి, బిట్‌-2 అభ్యర్థి వాకాటి సంధ్య, బిట్‌-3 అభ్యర్థి కోవూరు వెంకటేశ్వర్లు కాలనీలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరులో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. గతంలో నడిచేందుకు కూడా ఇబ్బందిగా ఉన్న వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించామని, వర్షాకాలంలో మురుగునీరు, వరద నీటి సమస్యలను పరిష్కరించేందుకు సైడ్‌ కాలువలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గత ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

కాకాణి నాయకత్వంలో సర్వేపల్లి అభివృద్ధి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు సురేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.
పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థిగా తనను, ఎంపీటీసీ అభ్యర్థులుగా గంగవరపు లక్ష్మీకళ్యాణి, వాకాటి సంధ్య, కోవూరు వెంకటేశ్వర్లును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అభ్యర్థులు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.