BREAKING
పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం

చంద్రబాబు స్ఫూర్తితోనే ఎమ్మెల్యే యరపతినేని సామాజిక న్యాయం - ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్య

Select Suryaa Now
చంద్రబాబు స్ఫూర్తితోనే ఎమ్మెల్యే యరపతినేని సామాజిక న్యాయం - ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగ   పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్    రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్య

పిడుగురాళ్ల రూరల్ ;  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ అన్నారు.
పిడుగురాళ్ల పట్టణంలోని షాదీ ఖానాలో గురజాల నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం జడ్పీటీసీ స్థానం జనరల్ కు కేటాయించినా, ఆ సీటును ఎస్సీ సామాజిక వర్గం మాదిగ కులానికి చెందిన పేద మహిళకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోజువారీ కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న కత్తి సరోజినీకిమాచవరం జడ్పీటీసీ సీటు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు  మందా కృష్ణ మాదిగ తరపునప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాదిగ కులానికి చెందిన కత్తి సరోజినీకి మాచవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చిన ఘనత టీడీపీదే, ఎమ్మెల్యే యరపతినేనిదే అని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమెకే జడ్పీటీసీగా అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు.
జనరల్ సీటు సాధారణంగా ధనవంతులకు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే దక్కుతుందని, అలాంటి పరిస్థితుల్లో ఒక పేద దళిత మహిళను ఎంచుకోవడం గురజాల నియోజకవర్గ చరిత్రలో చారిత్రాత్మక నిదర్శనం అని అన్నారు.
పల్నాడు చరిత్రలో ఆ రోజుల్లో దళితులను అగ్రకులాల వారితో సమానంగా కూర్చోబెట్టి సహపంక్తి భోజనం ఏర్పాటు చేసిన సంఘసంస్కర్త పల్నాటి బ్రహ్మనాయుడు అయితే, ఈ రోజు పేద వర్గాల నుంచి దళితులను నాయకులుగా తీర్చిదిద్దుతున్న గురజాల నియోజకవర్గ దళిత సంస్కర్త ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, 2004లోనే పెదకూరపాడు నియోజకవర్గంలో ఓసీ సీటును మాదిగ సామాజిక వర్గానికి చెందిన దొప్పలపూడి రేవతికిఇచ్చి దళితులను రాజకీయంగా చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు.
అదే స్ఫూర్తితో ఈరోజు మాచవరం మండల జడ్పీటీసీ సీటును దళిత మాదిగ మహిళ కత్తి సరోజినీకి ఇవ్వడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులందరం హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ మాదిగ మాట్లాడుతూ.. 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని, కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను చావగొట్టిన ఉదంతాన్ని దళితులు మర్చిపోలేదన్నారు. దానికి పూర్తి విరుద్ధంగా కూటమి ప్రభుత్వంలో దళిత పేద వర్గాలను నాయకులుగా తీర్చిదిద్దుతున్నందుకు చంద్రబాబు, యరపతినేనికి కృతజ్ఞతలు తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్లుగా మన ఓట్లు ఆధిపత్య వర్గాలకు, భూస్వాములకు వేశామని, ఈరోజు మన దళిత బిడ్డ, మాదిగ మహిళ బిడ్డ నిలబడిందని, కాబట్టి మాచవరం మండలంలోని మాల, మాదిగలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల ప్రజాస్వామికవాదులందరూ కత్తి సరోజినీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల