BREAKING
30వ డివిజన్‌లో నూనె రుషి యాదవ్ విస్తృత ప్రచారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు... డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం జడ్పిటిసి బరిలో 103 మంది ఎంపీటీసీ బరిలో 887 మంది అభ్యర్థులు కాగాo - టెక్కలి వలస రోడ్ మధ్యలో నీటి ప్రవాహం హోరెత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం - విశేష జనాదరణ - మహిళల మంగళ హారతులు అర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని ​మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిపై వైకాపా నాయకుల తీవ్ర ఆగ్రహం. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోండి --- కమిషనర్ సట్టముమ్ నీధియుమ్ సీజన్ 2 రివ్యూ.. ఆకట్టుకునే కోర్టు రూమ్ డ్రామా కక్కలపల్లి కాలనీలో ఎంపీటీసీ 3 కూటమి అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం ​ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరికలు. కూటమి అభ్యర్థుల విజయానికి చల్లా రవికుమార్ రెడ్డి ప్రచారం ​నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: టూటౌన్ సీఐ పి. శ్రీనివాసరావు హెచ్చరిక.

కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది?

Select Suryaa Now
కరువు జాబితాలో నవాబుపేటకు చోటేది?

*--రేపటి మహా ధర్నాకు తరలిరండి.* 

 *--బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు మాడెమోని నరసింహులు*

నవాబుపేట సూర్య న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నవాబుపేట మండలానికి చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ(రేపు)గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాడెమోని నరసింహులు పేర్కొన్నారు.బుధవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో నవాబుపేటకు చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నవాబుపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.రేపు నిర్వహించే మహా ధర్నాకు మండలవ్యాప్తంగా ఉన్న రైతులు,బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్,మాజీ ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య,మాజీ సర్పంచ్ యాదయ్య,మెండే అంజయ్య,రాజు,నర్సింలు,నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.