కూటమి అభ్యర్థుల విజయానికి చల్లా రవికుమార్ రెడ్డి ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలో కూటమి అభ్యర్థుల తరఫున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ షకీలా, 20వ వార్డు టీడీపీ అభ్యర్థి గందళ్ల వేణుకు మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా చల్లా రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.