పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోండి --- కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : సాధారణ ఎన్నికల విధుల్లో ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అదనపు ఎన్నికల అధికారి / కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం పర్యవేక్షించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను వినియోగించుకుని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఎస్ ఎ. సమ్మద్ తదితరులు పాల్గొన్నారు.