BREAKING
పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి

​నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: టూటౌన్ సీఐ పి. శ్రీనివాసరావు హెచ్చరిక.

Select Suryaa Now
​నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: టూటౌన్ సీఐ పి. శ్రీనివాసరావు హెచ్చరిక.

​కావలి మేజర్ న్యూస్:  కావలి పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల నివారణే లక్ష్యంగా రెండో పట్టణ  పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా బుధవారం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద రెండో పట్టణ సీఐ పి. శ్రీనివాసరావు స్వయంగా ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షించారు. ​నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ పి. శ్రీనివాసరావు,  ప్రాదేశిక ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్ రద్దీపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఉదయగిరి బ్రిడ్జి ప్రాంతంతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాలు, అక్కడ నిలిపే ద్విచక్ర వాహనాలు, ఆటోల వల్ల వాహనదారులకు కలుగుతున్న అంతరాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.  ​ఈ సందర్భంగా దుకాణదారులకు, వాహనదారులకు సీఐ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రోడ్లపైకి ఆక్రమణలు రాకుండా చూడాలని దుకాణదారులను కోరారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ... "ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.  ​ఈ కార్యక్రమంలో రెండో పట్టణ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.