BREAKING
నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ

కాగాo - టెక్కలి వలస రోడ్ మధ్యలో నీటి ప్రవాహం

Select Suryaa Now
కాగాo - టెక్కలి వలస రోడ్ మధ్యలో నీటి ప్రవాహం

తెర్లాం, సూర్య  : తుఫాను కారణంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు టెక్కలి వలస నుంచి కాగం పోవు పిఆర్ రోడ్డు మధ్యలో నీటి ప్రవాహం పొంగి ప్రవహించడంతో ప్రయాణికులు రాకపోకలు  స్తంభించాయి. ఎడతెరపలేని వర్షాలకు టెక్కలి వలస జగ్గయ్య చెరువు పొంగి ప్రవహించడంతో రోడ్డు మధ్యగుండా నీరు పారడంతో ప్రయాణికులు వేరే గత్యంతరం లేక తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసిన వారు పాములవలస మీదుగా పెరుమాలి ఆర్ఆర్ రోడ్డుకు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని ద్విచక్ర వాహనదారులు వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యం వలన కురిసే భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు పంటలు దిగ్బంధాన్నికి గురయ్యాయని రైతులు వాపోతున్నారు .మరి ఈ విపత్తును పరిగణలో తీసుకొని పంట నష్టం జరిగే ప్రాంతాలను సంబంధిత అధికారులు గుర్తించి తగిన నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని పలు  గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని అధికారుల్ని కోరుతున్నారు.

రిపోర్టర్ : తిరుపతి నాయుడు,  తెర్లాం, విజయనగరం జిల్లా.