కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ
బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ
నియామక పత్రం అందజేసిన బిజెపి మండల అధ్యక్షులు నిమ్మ అంజిరెడ్డి
కందుకూరు: భారతీయ జనతా పార్టీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా చిప్పలపల్లి గ్రామానికి చెందిన అంబటి కృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నిమ్మ అంజిరెడ్డి మాట్లాడుతూ... కందుకూరు మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు బీసీలందరినీ ఐక్యం చేసి వారి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు అంబటి యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి గౌర ప్రభాకర్, ముచ్చర్ల సర్పంచ్ ఊటు మహేందర్, మాదాపూర్ సర్పంచ్ బూర దిలీప్ గౌడ్, ధన్నారం సర్పంచ్ రమేష్, బూత్ అధ్యక్షులు బాలరాజ్, కుమార్, రవీందర్ పాల్గొన్నారు.