విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ --దాతృత్వాన్ని చాటుకున్న మల్లికార్జున రెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలం నల్లపురెడ్డిపల్లిపాఠశాల విద్యార్థులందరికీ ఆ గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని, విద్య పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు హెచ్. మురళీకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థుల చదువుకు సహకారం అందించిన మల్లికార్జున రెడ్డి కి పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దాత సహకారానికి పాఠశాల విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.