వెల్లాటూరు – చింతమోటు రోడ్డులో అడ్డంగా పడిన చెట్లను తొలగించిన భట్టిప్రోలు పోలీసులు
భట్టిప్రోలు, మేజర్‌న్యూస్ :
అర్నబ్ తుఫాను నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలో భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లాటూరు – చితమోటు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు బుధవారం భారీ ఈదురు గాలుల కారణంగా నెలకొరిగాయి రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. విషయం తెలిసిన వెంటనే భట్టిప్రోలు ఎస్ఐ గారు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను త్వరితగతిన తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించారు.