BREAKING
కిష్టాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే సందర్భంగా అవగాహన సమావేశం ఇరాన్‌తో వైద్యపరమైన వస్తువుల సరఫరాపై చర్చలు.. ఉపాధ్యక్షుడు వాన్స్ రాయబారం పోలీసు కుటుంబాలకు అండగా పల్నాడు జిల్లా ఎస్పీ కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం.

PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Select Suryaa Now
PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

*PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి*

*జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

కర్నూలు,మేజర్ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 28:- జిల్లాలో  PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.

బుధవారం కలెక్టరేట్ లో PC&PNDT కి సంబంధించిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని  నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్  వైద్యాధికారులను  ఆదేశించారు.. తదనంతరం జిల్లా స్థాయి సలహా కమిటీ  2 కొత్త స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లకు, 8 స్కానింగ్ కేంద్రాలు రెన్యువల్ కు, 07 మోడిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా సంబంధిత వాటన్నింటికి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు..   
                                                           
సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం, డిఎంహెచ్ఓ డా.కామేశ్వర ప్రసాద్, NGO ప్రతినిధి డా.బాలమద్దయ్య, ఎస్ఓ హేమ సుందరం, డెమో ప్రకాశ్, డిప్యూటీ డెమో  షఫీ ఉన్నిష తదితరులు పాల్గొన్నారు.