చెట్లు పడిపోయిన ప్రాంతంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి పర్యవేక్షణ
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 49 వ వార్డులో తుఫాను కారణంగా వార్డులో పడిపోయిన చెట్లను స్వయంగా కూటమి అభ్యర్థి ముక్క శ్రావణి విస్తృతంగా పరిశీలించి పడిపోయిన చెట్లు కొమ్మలను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాను కారణంగా విశాఖలో పలు ప్రాంతాల్లో వ్యతిరేకంగా చెట్లు పడిపోవడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా బాధాకరమని అధికారులు విస్తృతంగా ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లను తొలగించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. 49 వ వార్డులో చెట్లు విపరీతంగా పడిపోవడంతో అధికారులు సహాయంతో తొలగించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ముక్క. కిషోర్ కుమార్ నాయకులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.