BREAKING
ఫ్యాన్ గుర్తుకు ఓటు.... సుపరి పాలనకు చోటు. ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బందెల వెంకటరమణ.. *జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలు – జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సెక్రటేరీయేట్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30వ డివిజన్‌లో నూనె రుషి యాదవ్ విస్తృత ప్రచారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు... డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం జడ్పిటిసి బరిలో 103 మంది ఎంపీటీసీ బరిలో 887 మంది అభ్యర్థులు కాగాo - టెక్కలి వలస రోడ్ మధ్యలో నీటి ప్రవాహం హోరెత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం - విశేష జనాదరణ - మహిళల మంగళ హారతులు అర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని ​మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిపై వైకాపా నాయకుల తీవ్ర ఆగ్రహం. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోండి --- కమిషనర్ సట్టముమ్ నీధియుమ్ సీజన్ 2 రివ్యూ.. ఆకట్టుకునే కోర్టు రూమ్ డ్రామా

వైద్య సేవలకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

Select Suryaa Now
వైద్య సేవలకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

గరుగుబిల్లి, సూర్య : అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలకు అంత రాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఓ) డాక్టర్ వై విజయ్ మోహన్ సూచించారు. గరుగుబిల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పరిశీలిం చారు.ఈసందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ కు అత్యవసర వైద్య సేవల నిర్వహణపై తగు సూచనలు అందజేశారు.వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని గర్భిణులు, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని తెలిపారు.ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, జన రేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులో ఉన్నాయి లేదా అని పరిశీలించారు.తాగునీటి భద్రత, పరిస రాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా ముంద స్తు చర్యలు చేపట్టాలన్నారు.తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నందున పాము కాట్ల ఘటనలు సంభవించే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్ కు తెలియజేశారు.ప్రజలు తుఫాన్, వరద ల సమయంలో అవసరమైన మందు లు, ప్రథమ చికిత్స సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బిపి, మధుమేహం, గుండెజబ్బులు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కనీసం వారం రోజులకు సరిపడా మందులను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. డీహైడ్రేషన్, విరేచనాల నివారణకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రసవ తేదీ సమీపించిన గర్భిణులను ముందు గానే సురక్షిత ప్రాంతాల్లోని ఆసుపత్రు లకు తరలించడం ద్వారా అత్యవసర సమయాల్లో ఇబ్బందులను నివారించ వచ్చన్నారు.తుఫాన్, వరదల సమ యంలో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాల ని డిఐఓ పేర్కొన్నారు.గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వ్యాక్సిన్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయ ని, అలాగే గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమల ప్రసాద్ వివరించారు. ఈపరిశీలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎన్ ఎం కె తిరుమలప్రసాద్‌తోపాటు సూపర్వైజర్లు  ఎన్ జగదీశ్వరి,చింతాడ ఉదయ కుమారి,ఫార్మసిస్ట్ దాసరి మృత్యుంజ యరావు, ల్యాబ్ టెక్నీషియన్ పొన్నగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.