21, 22 వార్డుల్లో కాలవ భరత్ సుడిగాలి ప్రచారం
రాయదుర్గం టౌన్, మేజర్ న్యూస్ : రాయదుర్గం పట్టణంలోని 22వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కొలిమి మంజులకు మద్దతుగా టీడీపీ యువ నాయకులు కాలవ భరత్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు,బుధవారం వార్డులోని ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాయదుర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు.l,జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తోందని కాలవ భరత్ తెలిపారు,వార్డులోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి టంకశాల హనుమంతును, 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొలిమి మంజులను రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు,ఈ ప్రచార కార్యక్రమంలో పసుపులేటి రాజు,పూజారి శివ,కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.