BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..? ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..-తహసీల్దార్ శ్రీకాంత్ బయ్యప్పగారిపల్లిలో ఎన్నికల సందడి.. ప్రజల్లోకి ఎంపీటీసీ అభ్యర్థి అవినీతిని తరిమి కొట్టండి.. అభివృద్ధికి ఓటేయండి రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా కోడలు ఉపాసన.. తాతగారితో కలిసి ప్రత్యేక పూజలు వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి 15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం అదితీ రావు హైదరి గ్లామరస్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పువ్వాడి దంపతులకు సత్కారం తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు. 30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు...

తుఫాను ముప్పు లో వ్యాధులు ప్రబలకుండా తస్మాత్ జాగ్రత్త

Select Suryaa Now
తుఫాను ముప్పు లో వ్యాధులు ప్రబలకుండా తస్మాత్ జాగ్రత్త

పూసపాటిరేగ, సూర్య : తుఫాను రావచ్చు.. వర్షాలు ముంచెత్తవచ్చు.. కానీ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో అప్రమత్తత తగ్గకూడదు అని అర్నాబ్ తుఫాను నేపథ్యంలో తీరప్రాంత మత్స్యకార గ్రామాల ప్రజలకు వైద్య సేవలు నిరంతరాయంగా అందించాలనే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి  ఎస్. జీవన రాణి అన్నారు. బుధ వారం కోనాడ తీరప్రాంత గ్రామంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్నిజీవన్ రాణి సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో అందుతున్న సేవలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, తుఫాను నేపథ్యంలో వైద్య సిబ్బంది చేపడుతున్న ముందస్తు చర్యలపై వైద్యాధికారి డాక్టర్ బి. కృష్ణ చైతన్య ని అడిగి తెలుసుకున్నారు. తుఫానుకు ముందు, తుఫాను సమయంలో, తుఫాను అనంతరం ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
???? స్వచ్ఛమైన తాగునీరు – వ్యాధుల నివారణకు తొలి అడుగు
తుఫాను కారణంగా తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన చోట నీటి శుద్ధి చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సూచించారు. అతిసారం, జ్వరాలు తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
???? దోమల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రఘు వంశీ గారు మాట్లాడుతూ, తుఫాను సమయంలో నిల్వ నీరు పేరుకుపోకుండా చూడాలని, దోమల ఆవాసాలను నివారించాలని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.