నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందబాబు
వేమూరు(భట్టిప్రోలు) మేజర్ న్యూస్: ఆర్నబ్ తుఫాను కారణంగా నేలకొరిగిన పంట పొలాలను బుధవారం జంపని వేమూరు మధ్య పంట పొలాలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంట నేలకొరిగినప్పటికీ పొలాల్లో మీరు తక్కువగా ఉండటం వల్ల నష్టం జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని రైతులు వివరించారు. ఆయనతోపాటు టిడిపి నాయకులు, రైతులున్నారు.