చదలవాడ జడ్పిటిసి అభ్యర్థి ఎన్నికల ప్రచారం
వేమూరు(భట్టిప్రోలు) మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో వేమూరు జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేల్పుల రవి ప్రసాద్, చదలవాడ ఎంపీటీసీ అభ్యర్థి తురుమెళ్ళ సుధారాణి,ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి అండగా నిలవాలని అభ్యర్థించారు. ఆయనతోపాటు మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకటసుబ్బయ్య, పార్టీ నాయకులు బో ల్లి ముంత కోటేశ్వరరావు, ధనుంజయ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలున్నారు.