వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ.
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్సిపి సిటీ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇంచార్జ్ మ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసిపి మేయర్ అభ్యర్థి మనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 59వ డివిజన్ నుంచి..యూసఫ్ వారి మిత్రబృందం..20 కుటుంబాలు టిడిపిని వీడి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి . పార్టీ కండువా వేసి సాధారణంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి..పార్టీలోకి వస్తున్నవారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రశేఖర్ రెడ్డి భరోసా ఇచ్చారు
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ.. దుర్మార్గ విధానాలను.. వ్యతిరేకిస్తూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఇమడలేక.. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్న.. సందర్భాలను మనం చూస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు చమర గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమచిత న్యాయంతో పాటు , రాష్ట్ర అభివృద్ధి.. రెండు సమపాళ్లలో జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 59 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి చీదెళ్ల కిషన్, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.