జలనారాయణుని నీరద జలాభిషేకం
విజయనగరం. (కల్చరల్), సూర్య : పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో గల పుష్కరిణిలో కొలువైన జలనారాయణ స్వామి కి బుధవారం కదిలే మేఘాలే క్షణమాగి జలాభిషేకం చేసాయి. జలధిశయనుడైన శ్రీ స్వామి వారిని ఇటీవల పుష్కరిణిలో ప్రతిష్టించారు.మున్నీట పవ్వళించు శేషశయనుడు నీటి లో మునిగి విశాలనేత్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రాఘవాచార్యులు శ్రీ స్వామి వారికి ప్రణమిల్లి అర్చనలు చేసారు.
రిపోర్టర్ : కామేశ్వరరావు (కల్చరల్), విజయనగరం.