BREAKING
25వ వార్డులో నూరి ఇక్బాల్ ప్రచార జోరు వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. నాగరాజుకు కార్యకర్తల అండ దర్భరేవు డ్రైన్ సమస్యను పరిష్కరించాలి -- సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి కౌరు లక్ష్మి జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ దేశం నేత నాయుడు విస్తృత ప్రచారం అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి-- సిఐ రఘు కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులకు సీట్లు --గెలిపిస్తే ఏలూరు మరింత అభివృద్ధి నూజివీడు పట్టణానికి సకల హంగులతో నగర శోభ — మంత్రి కొలుసు పార్థసారథి — బిజెపి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ 33 వ వార్డులో ప్రచారం గత అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి-- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026

మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్

Select Suryaa Now
మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్

 

 

సూర్య కరీంనగర్ ప్రతినిధి::
కరీంనగర్‌లో జరుగుతున్న విద్యార్థులు, యువత సదస్సులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ తీరును ప్రస్తావిస్తూ, మూడు తరాల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ప్రజల అభీష్టానికి విరుద్ధంగా బలవంతంగా కలిపిందని, 1968లో తెలంగాణ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిందని కేటీఆర్ ఆరోపించారు. 1971లో తెలంగాణ ప్రజలు గెలిపించిన 11 మంది పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్‌లో కలుపుకుందని విమర్శించారు.
2004లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, పదేళ్ల పాటు రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేశారని అన్నారు. శ్రీకాంతాచారి వంటి వందలాది మంది ప్రాణత్యాగాలు, కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాతే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.