BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం

పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో అక్టోబర్ 25వ తేదీ ఆదివారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు బలపరిచిన పెరవలి జడ్పీటీసీ అభ్యర్థి అతికాల వెంకట రామకృష్ణమ్మ (శ్రీను) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్, ఖండవల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు భూపతిరాజు రవివర్మ పాల్గొన్నారు.
ఆయనతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.గ్రామంలో ఇంటింటా సాగిన ఈ ఎన్నికల ప్రచారంతో ఖండవల్లిలో రాజకీయ సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.