జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్
కొండాపూర్,మేజర్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ చీరలు పంపిణీ చేశారు. పండుగ సందర్భంగా మహిళా కార్మికులకు చీరలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.నిత్యం నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని బలరాం యాదవ్ తెలిపారు.