మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
మాదాపూర్,మేజర్ న్యూస్ :ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అర్చనా చౌదరి మాలిక్ (29) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అర్చనా చౌదరి మాలిక్ మైండ్‌స్పేస్‌లోని ర్యాండ్‌స్టాడ్ సంస్థలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తూ.. చంద్రనాయక్ తండాలోని ఎస్‌ఆర్ సద్గురు రెసిడెన్సీలో నివాసం ఉంటుంది. కాగా అదే సంస్థలో పనిచేసే భండారి విమల్‌తో నాలుగేళ్లుగా సంబంధం ఉన్నట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో విమల్ తన తల్లితో కలిసి చేర్యాలలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
అర్చనా అతడికి వీడియో కాల్ చేసింది. తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీ కట్టి చూపిస్తూ, తనను వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో విమల్ అప్రమత్తమయ్యాడు. ఆ తర్వాత విమల్ పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ అర్చనా స్పందించకపోవడంతో ఆందోళనకు గురైన అతడు ఆమె నివాసానికి చేరుకున్నాడు. అయితే, ఫ్లాట్ తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో 112 పోలీసులకు సమాచారం అందించాడు. పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపును బలవంతంగా తెరిచి చూడగా అర్చనా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.