BREAKING
నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

Select Suryaa Now
నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : నియోజకవర్గంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నాలాల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే  గాంధీ తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ ఫేజ్‌-2లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79.58 కోట్ల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చెరువు అలుగు నుంచి తారానగర్ వరకు రూ.24 కోట్లతో చేపడుతున్న నాలా విస్తరణ, ఆర్‌సీసీ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే  గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఆర్‌సీసీ బెడ్, సైడ్‌వాల్స్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నాలల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా సరైన లెవల్స్‌తో పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రధాన రహదారులపై పనులు జరిగే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసి, భవిష్యత్తులో వరద ముంపు సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  గాంధీ పేర్కొన్నారు.