వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి
చందానగర్,మేజర్ న్యూస్ : వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం యువత కృషి చేయాలని బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మహారాష్ట్ర యువ సంవాద్ ఇన్‌చార్జి కసిరెడ్డి సింధూరెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని ధూలే నగరంలో ఆదివారం ఉదయం ‘యువ సంవాద్’ పేరిట నిర్వహించిన ర్యాలీలో ఆమె యువతను ఉద్దేశించి మాట్లాడారు.సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, అవాస్తవాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని సింధూరెడ్డి సూచించారు.
బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని మాత్రమే పంచుకోవాలని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా యువత ముందుకు సాగాలని ఆమె అన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వేలాది మంది యువత వీక్షించారు.