సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : బీజేపీ తెలం గాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం
కాకతీయ నగర్ డివిజన్ పరిధిలోని శివ సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు జగదీష్ చారి ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత ఆర్ కె శ్రీని వాస్, డివిజన్ ఇన్ చార్జి సందిల్ల రమేష్ గౌడ్ హజరై, పట్టభద్రులకు దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున, మల్లేష్ యాదవ్, సోమనాథ్ చారి, పరమేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు