నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026
నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026
నేటి రాశి ఫలాలు: 26 అక్టోబర్ 2026, సోమవారం.. ద్వాదశ రాశుల వారి జాతకం, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభ వివరాలు!
సూర్య భక్తి & జ్యోతిష్య విభాగం: 26 అక్టోబర్ 2026, సోమవారం నాటి ద్వాదశ రాశుల ఫలితాలు:
మేషం : పనుల్లో పట్టుదల అవసరం. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృషభం : మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించడం మంచిది.
మిథునం : చేపట్టిన పనుల్లో స్వల్ప అడ్డంకులు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
కర్కాటకం : ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులు వేగవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి మద్దతు లభిస్తుంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.
సింహం :సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. భూమి, వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మేలు.
కన్య :రోజువారీ పనుల్లో శ్రద్ధ వహించాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
తుల : అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
వృశ్చికం : కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
ధనుస్సు :ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం : శ్రమాధిక్యత వల్ల స్వల్ప అలసట అనిపించవచ్చు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించాలి. ఆకస్మిక ఖర్చులు నియంత్రించుకోవాలి.
కుంభం : చేపట్టిన వ్యవహారాల్లో అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.
మీనం : ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ రంగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.