BREAKING
అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సందడిగా సదర్ సమ్మేళనం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు ఘన స్వాగతం రాజాంలో మున్సిపల్ సమరం! *20 ఏళ్ల నిరీక్షణకు తెర * జడ్పిటిసి సిరమ్మకు శుభాకాంక్షలు సందడి... కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి 29న జరిగే కాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలి నెట్టింట చక్కర్లు కొడుతున్న అనిరుధ్, కావ్య వెడ్డింగ్ వీడియో.. అసలు నిజం బయటపడింది! విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలి అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వార్షిక కార్నివాల్ వీక్ 2026  ప్రారంభం *జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో శ్రీనిధి విద్యార్థినికి సిల్వర్ మెడల్* అంగన్‌వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణ – చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలి పారితోషకం జాప్యంపై సిబ్బంది పెదవి విరుపు సమాజం పట్ల బాధ్యతతో డ్రగ్స్ కి దూరంగా ఉంటూ తల్లిదండ్రుల కలను నెరవేర్చాలి

Weekly Horoscope 25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Select Suryaa Now
Weekly Horoscope  25 Oct 2026 నుండీ 31 Oct 2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Weekly Horoscope (Rasi Phalalu) 25.10.2026 నుండీ 31.10.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

♈మేషరాశి... ప్రారంభంలో వృత్తిపరమైన శ్రమ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య విషయ ప్రణాళికలు, మార్పులు. మాతృ, గృహ, విద్య అంశాలలో ఆలోచనలలో, మాటలలో ప్రశాంతత కొరకు, పెద్దల సహకారాన్ని,ఆశీస్సులను సద్వినియోగ పరుచుకుంటూ ఘర్షణలను అధిగమించాలి. మధ్యలో వృత్తి, వ్యక్తిగత విషయాలలో ఆకస్మిక ఆలోచనలలో ఆత్మస్థైర్యం ముఖ్యం. నిర్ణయాలలో ఉద్వేగాలకు తావివ్వరాదు. కుటుంబ విష యాలలో, వ్యాపార వ్యవహారాలలో, జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వారాంతం మిత్రులతో చర్చలు, ప్రయాణాలు. ఆత్మీయులతో, ప్రియమైన వ్యక్తులతో ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.

♉వృషభరాశి… ప్రారంభంలో తోబుట్టువులు, మిత్రుల నెట్వర్క్ అనుకూలిస్తుంది. తండ్రి పెద్దల తోడ్పాటు. నూతన అవకాశాలు. మానసిక ప్రశాంతత ముఖ్యం. సజ్జన సహకారంలో అసంతృప్తి. ఆకస్మిక లాభాలకు కొంతవరకు అవకాశం. ప్రయాణాలు లాభిస్తాయి. అయినప్పటికీ తగు జాగ్రత్తలు ముఖ్యం. మధ్యలో ఆత్మీయుల కొరకు, ఆరోగ్యం, పెట్టుబడుల కొరకు ఖర్చులు అధికం. ముఖ్యులతో ఘర్షణలకు తావివ్వరాదు. నూతన ఉత్సాహం, కొత్త ఆలోచనలు, పనులు కొంత వరకు ముందుకు వెళతాయి. పూర్వపు రుణములు తీరుస్తారు. ఆరోగ్యం అనుకూలం. శ్రమతో పనులు సాధిస్తారు. వారాంతం ఆర్థిక విషయ, వాగ్దానాలలో, కుటుంబ, బంధు మిత్రులతో చర్చలు. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు, రుణ విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. దత్త ఆరాధన మేలు

♊మిధున రాశి… ప్రారంభంలో వృత్తి వ్యవహారాలలో,ఆర్థిక, కుటుంబ అంశాలలో శ్రమ అధికం. మాటలలో ఉద్వేగత, కఠినత పై దృష్టి సారించాలి. భాగస్వామితో చర్చలలో, వృత్తిపరమైన నిర్ణయాలలో ప్రశాంతత ముఖ్యం. నెట్వర్క్ అనుకూలిస్తుంది, ధనాదాయం అనుకూలం, చిన్ననాటి మిత్రుల సహకారం, భూవిషయాలలో, లాభాలలో శ్రమతో కూడిన అభివృద్ధి. మధ్యలో శ్రమ ఒత్తిడి, అధికవ్యయం ప్రశాంతత తక్కువ, నిద్రలేమిని అధిగమించాలి. వృత్తి పరమైన బాధ్యతలు శ్రమ ఆరోగ్యపరమైన ఇబ్బందులకు అవకాశం. తండ్రి ఆరోగ్య శ్రద్ధ. వారాంతం ఆర్థిక వ్యయములు అధికం. నూతన నిర్ణయాలు ఆలోచనలు. కమ్యూనికేషన్ పై దృష్టి సారించాలి. సంతాన వర్గం కొరకు, ఆత్మీయ మిత్రుల కొరకు ఖర్చులు. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.

♋కర్కాటక రాశి … ప్రారంభంలో దూరప్రాంత వ్యక్తులతో వ్యాపార వ్యవహారాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్యలో ఆటంకాలు, పనులు నెమ్మది. వృత్తి పరమైన అభివృద్ధిలో ఒత్తిడి, ప్రశాంతత తక్కువ. దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పై దృష్టి. మధ్యలో వృత్తిపరంగా నూతన అవకాశాలు, కొత్త ఆలోచనలు, ప్రత్యర్థులపై విజయసాధనలో, సంతాన అభివృద్ధి, వృత్తి పరమైన విషయాలలో కీలక నిర్ణయాలు. ఉన్నతస్థాయి, అనుభవజ్ఞుల సంప్రదింపులు, సలహా, సహకారం. ఆలస్యమైన ఆశించిన పనులలో విజయాలు, సృజనాత్మకత, స్థిరాస్తులు, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. స్త్రీల సహకారం ప్రయోజనాత్మకం. మంచి కమ్యూనికేషన్తో పనులు సాధిస్తారు. వారాంతం నిద్రలేమి, గృహ సంబంధ షాపింగులు, ఒత్తిడి, శ్రమతో పనులు పూర్తి. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు. 

♌సింహరాశి…ప్రారంభంలో ఆరోగ్య, పోటీలు, విజయ సాధన, న్యాయ అంశాలు కొరకు ఆకస్మిక వ్యయం. ముఖ్య వ్యవహారాలలో ఆలస్యాలు, ఆటంకాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక పెట్టుబడుల కొరకు చర్చలు. జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. సంతాన వృద్ధిలో ఒత్తిడిని అధిగమించాలి. మధ్యలో తండ్రి, ఉన్నత విద్య, సామాజిక సేవ కొరకు ఖర్చులు. ఘర్షణలని, ఉద్వేగాలకి తావివ్వరాదు. స్థిరాస్తులు, దూర ప్రయాణాలలో, డ్రైవింగ్లో శ్రద్ధ అవసరం. వృత్తిలో అధిక శ్రమ, ప్రయాణాలు, తోబుట్టువులు, ఆత్మీయుల సహకారం. ఆకస్మిక వ్యయములు. వారాంతం వృత్తిపరంగా అనుకూలం నెట్వర్క్ బాగుంటుంది మిత్రుల సహకారం. పనులు కదులుతాయి. హనుమాన్ మందిర దర్శనం మేలు.

♍కన్యా రాశి… ప్రారంభంలో ఆశించిన మైత్రి బంధాలలో, వ్యాపార వ్యవహారాలలో ఆలస్యమైనప్పటికీ అనుకూలతలు. తల్లి, గృహ సభ్యులు, ముఖ్యంగా భాగస్వామి ప్రోత్సాహం ముఖ్య నిర్ణయాలలో కోరుకుంటారు. వాయిదా పడ్డ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. గురువుల తోడ్పాటు, ఆశీస్సులు అనుకూలం. వారం మధ్యలో వారసత్వ ఆస్తులు, భూ వ్యవహారాలు, తోబుట్టువులతో చర్చలు వేగవంతం. ఆరోగ్య, ఆహార విషయంలో నిర్లక్ష్యం తగదు. నెట్వర్క్ బావుంటుంది. ఆర్థిక విషయాలు, కుటుంబముతో సౌఖ్యం, కమ్యూనికేషన్, వ్యక్తిగత వృద్ధి, ఆశాజనకం. వారాంతం వృత్తిలో, ఆర్థికంగా అనుకూలత, సమయస్ఫూర్తి నిర్ణయాలు, అమ్మవారి ఆరాధన అనుకూలిస్తుంది.

♎తులా రాశి… ప్రారంభంలో శ్రమతో, సామర్థ్యంతో పనులను పూర్తి. వృత్తిలో నైపుణ్యాలు పెంచుకుంటారు, గౌరవం, శ్రమ బాధ్యతలు అధికం. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు, కొంతమేర అవకాశాలు. వ్యాపార వ్యవహారాలపై దృష్టి, ఆర్థిక వ్యవహారాలలో, జీవిత భాగస్వామితో చర్చలలో, సజ్జన సహకారంలో ప్రశాంతత అవసరం. ఘర్షణాత్మక ఆలోచనలకు, ఒత్తిడికి దూరం మేలు. స్నేహ సంబంధాలు, వృత్తి, వ్యాపారపరంగా నూతన పరిచయాలు. మధ్యలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు కోవాలి. ఆరోగ్యశ్రద్ధ అవసరం. వృత్తిపరంగా ప్రశాంతత తక్కువ. పనులు వాయిదా. శత్రు రోగ రుణ ఇబ్బందుల్ని శ్రమతో అధిగమిస్తారు. వారాంతం అధికారులతో, పెద్దలతో కమ్యూనికేషన్లో తగిన సమన్వయం అవసరం. ఆదిత్య హృదయ పారాయణ మేలు.

♏వృశ్చిక రాశి... ప్రారంభంలో సంతానరీత్యా, ఆత్మీయ వ్యక్తులతోను, ఆర్థిక అంశాల యందు ప్రశాంతత తక్కువ. ముఖ్య నిర్ణయాలలో ఉద్వేగాలు. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలలో ఘర్షణలు. గురువుల సహకారం, క్షేత్ర సందర్శన అనుకూలిస్తాయి. ఒత్తిడి, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు, ఇబ్బంది పెట్టే వ్యక్తులని పుణ్యబలంతో అధిగమిస్తారు. మధ్యలో మైత్రి బంధాలు అనుకూలం, వ్యాపార వ్యవహారాలపై దృష్టి, జీవిత భాగస్వామితో షాపింగ్, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో ఆత్మీయ వ్యక్తులతో, అధికారంలో ఉన్నవారితో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిలో స్త్రీలతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత ముఖ్యం. వారాంతం డ్రైవింగ్, కంటి ఆరోగ్య, ఆహార అంశాలలో శ్రద్ధ తీసుకోవాలి, సోషల్ మీడియాలో విమర్శలకు దూరం మంచిది. వెంకటేశ్వర ఆరాధన మేలు.

♐ధను రాశి… ప్రారంభంలో గృహ, స్థిరాస్తి, తల్లి ఆరోగ్యరీత్యా శ్రద్ధ, ఖర్చులు. భూ, వ్యవసాయ విషయాల పై దృష్టి. వాయిదాలు, ఖర్చులు వున్నా వివేకము, బుద్ధి బలంతో అధిగమిస్తారు. ఆకస్మిక మార్పు వల్ల ఉద్వేగాలు, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రియమైన వారి ఆరోగ్య, అభివృద్ధి, అవసరాలు రీత్యా ఖర్చులు చేసినప్పటికీ ఘర్షణలకు తావివ్వరాదు. నిర్ణయాలలో, ఆలోచనల సమన్వయంలో ప్రశాంతత చాలా ముఖ్యం. మధ్యలో అధిక శ్రమతో పనులు సాధిస్తారు, స్త్రీల సహకారం అనుకూలం. విద్యార్థులు పోటీలలో శ్రమతో సాధిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆలస్యమైనా పనులు ముందుకు వెళతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారాంతం సంఘంలో గౌరవం నూతన పరిచయాలు వృత్తి వ్యాపారాల అభివృద్ధి. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నరసింహస్వామి ఆరాధన మేలు.

♑మకర రాశి... ప్రారంభంలో పట్టుదల, శ్రమతో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు సాధిస్తారు. ఆర్థిక, కమ్యూనికేషన్ అనుకూలం. ముఖ్యంగా భాగస్వామి, సజ్జన సహకారం, పెద్దల ఆశీస్సులతో, దూరంగా ఉన్న తోబుట్టువుల చర్చలతో ప్రణాళికతో భూ వ్యవహారాలలో ముందుకు వెళతారు. స్థిరాస్తులు, గృహ, సంతాన విద్య, మాతృ విషయాలలో కీలక నిర్ణయాలు. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ. మధ్యలో ఆత్మీయులతో విందు వినోదాల్లో, కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహకారం. కుటుంబము, ముఖ్యంగా సంతానానికి వృత్తిలో శ్రమకి తగిన గుర్తింపు, నూతన అవకాశాలు. ఉన్నతస్థాయి వ్యక్తుల సహకారం. సృజనాత్మకత బాగుంటుంది. వారాంతం పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి. వృత్తిలో పలుకుబడి కల పెద్దల సహకారం. మాట విలువ, ఆర్థిక అంశాలు ప్రయోజనకరం. గణేశారాధన మేలు.

♒కుంభ రాశి... ప్రారంభంలో ఆర్థిక విషయాలు ఆలస్యం, న్యాయ, రుణ, ఆరోగ్య విషయాలలో అభివృద్ధికి ప్రయత్నాలు. కృషిశీలత, నైపుణ్యాలు, అధిక శ్రమతో మాట విలువ, గౌరవం పెంపొందించుకుంటూ, వృత్తిలో అభివృద్ధికై, మిత్రుల సహకారం సద్వినియోగ పరుచుకుంటూ ఆర్థిక అభివృద్ధికై తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. దంత ఆరోగ్య శ్రద్ధ అవసరం. కుటుంబ ఖర్చులు అధికం. మధ్యలో ఆశించిన పనులలో లక్ష్యంతో సాధిస్తారు. వృత్తిలో మిత్రులు, ఇంట్లో తోబుట్టువులతో చర్చించి ముఖ్య వ్యవహారాలలో ముందుకు వెళతారు. గృహ, స్థిరాస్తి అంశాలలో ఆలస్యాలు, ప్రశాంతత తక్కువ. తల్లి ఆరోగ్య శ్రద్ధ. పెద్దలతో చర్చించేటప్పుడు వినయం, సమన్వయం ముఖ్యం. కమ్యూనికేషన్ మీద దృష్టి సారించాలి. స్త్రీల సహకారం అనుకూలం. వ్యాపార వ్యవహారాలలో తగిన జాగ్రత్త అవసరం. శ్రీకృష్ణ మందిర సందర్శన మేలు.

♓మీన రాశి… ప్రారంభంలో వ్యక్తిగత విషయాలలో, ఆరోగ్యంలో బద్దకాన్ని అధిగమించాలి. ఉద్వేగాలకు దూరంగ, ప్రశాంతంగా, ఆత్మీయులతో ఆర్థిక ఘర్షణ లేకుండా మంచి ఆలోచనలను సద్వినియోగ పరుచుకోవాలి. కుటుంబ విషయాలలో, సంతాన వర్గంతో, ఆర్థిక నిర్ణయాలలో, వాక్కులో కఠినతను నియంత్రిస్తూ ముందుకు వెళితే అనుకూలత. ప్రియమైన వ్యక్తులతో ఆలోచనల సమన్వయం ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. మధ్యలో శ్రమతో అనుకున్న పనులు సాధించినప్పటికీ, వృత్తిలో కొలీగ్స్ సహకరించిన, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో పనుల జాప్యం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు,విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. వారాంతం గృహసౌఖ్యం, ప్రశాంతత పై దృష్టిసారిస్తారు. బంధు మిత్రుల కలయిక. అనవసర చర్చలకి అవకాశం ఇవ్వరాదు. ఆదిత్య హృదయ పారాయణ మేలు.

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com