BREAKING
ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం

గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత

Select Suryaa Now
గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత

నెక్కొండ, మేజర్ న్యూస్, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్‌ను నెక్కొండ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 12 కిలోల ఎండు గంజాయితోపాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.నెక్కొండ ఎస్సై జలగం శ్రావణ్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి ఆదివారం స్థానిక బస్టాండ్‌ సమీపంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అప్రమత్తమైన సిబ్బంది అతడిని పట్టుకుని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద 12 కిలోల ఎండు గంజాయి లభించడంతోపాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి అక్రమ రవాణాలో కానిస్టేబులే ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం.
పోలీసుల విచారణలో నిందితుడు మహారాష్ట్రకు చెందిన నితిన్‌ న్యాను షిండేగా గుర్తించారు. అతను మహారాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్న క్రమంలో నెక్కొండలో పట్టుబడినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో అతడే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి సరఫరా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ అక్రమ రవాణా వ్యవహారంలో ఇతరుల ప్రమేయం ఎంతవరకు ఉంది? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

రిపోర్టర్; శ్రావణి, నెక్కొండ ,వరంగల్ జిల్లా