BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక

Select Suryaa Now
ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి  హాకీ పోటీలకు పందలపాక   విద్యార్థులు ఎంపిక

. బిక్కవోలు మేజర్ న్యూస్. మండలంలోని, పందలపాక శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామదర్శకులు ద్వారంపూడి యువరాజా రెడ్డి తెలిపారు. కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ నందు నందు శనివారం హాకీ మైదానంలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్  హాకీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పందలపాక పాఠశాల 9వ తరగతి విద్యార్థులు అండర్ 17 విభాగంలో హేమ సాయి శ్రీ , అవినాష్ అండర్ 19 విభాగంలో కౌశ్య శ్రీ  ఎంపికైనట్లు యువ రాజారెడ్డి తెలిపారు 

వీరు నవంబర్ నెలలో జరుగు రాష్ట్రస్థాయి  పోటీలలో  ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొననున్నట్లు ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి  తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించిన పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డిని భీమేశ్వర్ రెడ్డి నీ అభినందించారు .ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానానికి వెళ్లేలా ప్రోత్సహించడం దాతలు అయినా పందలపాక హాకీ పూర్వ క్రీడాకారుల సహకారం నేడు పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడానికి దోహదం చేసిందని విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక శిక్షణ కూడా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు యువ రాజారెడ్డి ఆధ్వర్యంలో హాకీ పూర్వ క్రీడాకారులు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్రస్థాయి పోటీలకు పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు.ఎంపికైన క్రీడాకారులను వ్యాయామ ఉపాధ్యాయుడు యువ రాజారెడ్డిని భీమేశ్వర రెడ్డిని పందలపాక హాకీ పూర్వ క్రీడాకారులను అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్తిరాజు హాకీ ఒలింపిక్ సంఘ అధ్యక్షులు రవిరాజు నాగమణి ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ కళాశాల సీనియర్ ఉపాధ్యాయులు నాగబాబు వీరభద్ర రావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు అభినందించారు