మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ
తిరుపతి, మేజర్ న్యూస్:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 31 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ మీ ఇంటి ఆడబిడ్డగా సోదరిగా ఆదరించి సీరియల్ నెంబర్ 1 గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ ఓటర్లను అభ్యర్థించారు.ఆదివారం
నగరపాలక సంస్థ పరిధిలోని 31 వ డివిజన్ లో ఉన్నా నెహ్రు నగర్ తదితర ప్రాంతాలలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ జనసేన టిడిపి బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భానుప్రియను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి అభ్యర్థిస్తున్నారు. డివిజన్ పరిధిలోని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
మీ అందరికీ అందుబాటులో ఉండి ఒక సోదరిగా, మీ ఇంటి అడ్డుపడుచు గా అభివృద్ధి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, ఇప్పటికే ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం దేనని చెప్పారు. తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే రానున్న రోజుల్లో డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపుతానని ఓటర్లకు, డివిజన్ లోని ప్రజలకు హామీ ఇచ్చారు. టిడిపి బూత్ కన్వీనర్ ఎం లక్ష్మి, జనసేన నాయకుడు సతీష్ యాదవ్, మధుసూదన్, రేఖ, గోవిందా చారి, మధు ఆచారి, సురేష్, రాజేష్, విజయలక్ష్మి, ఉదయగిరి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter
9705347341.