ప్రచారంలో దూసుకుపోతున్న రెండో వార్డ్ వైసిపి అభ్యర్థిని కాళహస్తి శ్వేత శ్రీ
మదనపల్లి,మేజర్ న్యూస్ : మున్సిపల్ 2వ వార్డు వైసిపి అభ్యర్థిని కాళహస్తి శ్వేత శ్రీ ప్రచారంలో దూసుకుపోతున్నారు.మీ ఇంటి ఆడపడుచుని ఆశీర్వదిస్తే,తప్పకుండా వార్డు అభివృద్ధి చేస్తానని ప్రజలతో మమేకమవుతున్నారు.ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం నుండి 2వ వార్డులో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్బంగా కాళహస్తి శ్వేత శ్రీ మాట్లాడుతూ నవంబర్ నెల 1వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న మున్సిపల్ ఎన్నికలలో వైసిపి తరపున చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటా చెలపతిని,మదనపల్లి రెండవ వార్డు అభ్యర్థి అయిన నన్ను గెలిపించాలని కోరారు.మీ ఇంటి బిడ్డగా,మీ ఇంటి ఆడపడచుగా,మీలో ఒకరిగా,మదనపల్లె అభివృద్ధికి,మరోసారి మీ ఆశీస్సులు,దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరారు.మీ అమూల్యమైన, విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి,వేయించి మీ ఇంటి బిడ్డలను అఖండ మెజారిటీతో గెలిపించి,ప్రజాసేవకు మరింత ప్రజా బలాన్ని చేకూర్చాలని రాగ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలపారు.అనపగుట్ట,చంద్రాకాలనీలో పర్యాటన జరిగింది.మీ ప్రేమే నా ధైర్యమని,మీ నమ్మకమే నా బాధ్యతని మరియు మీ ఓటే మన వార్డు అభివృద్ధి అని అన్నారు.రెండవ వార్డు అభివృద్ధే నా సంకల్పమని తెలిపారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన మేలు,సంక్షేమ పథకాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.ఈ ప్రచార కార్యక్రమంలో పెద్దఎత్తున వార్డు ప్రజలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి