BREAKING
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ

Select Suryaa Now
ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ


మదనపల్లె,మేజర్ న్యూస్ : సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా నివాసం ఉన్న రెండవ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని రెండవ వార్డ్ టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి ఇడగొట్టి మల్లీశ్వరి వార్డు ప్రజలను కోరారు.ఆదివారం మదనపల్లె మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డెన్నతో కలిసి ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాన్స్ రెడ్డెన్న మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా తన సతీమణి ఇడగొట్టి మల్లీశ్వరి పోటీ చేయడం జరుగుతోందని,కావున సైకిల్ గుర్తుపైన కౌన్సిలర్ అభ్యర్థికి చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకు సైకిల్ గుర్తుపైన మరో ఓటువేసి ఇద్దరిని గెలిపించాలని అభ్యర్థించారు.మల్లీశ్వరిని గెలిపిస్తే,వార్డు ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించడమే కాకుండా జవాబుదారీగా ఉంటామని స్పష్టం చేశారు.రెండవ వార్డును అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహాయ,సహకారాలతో మున్సిపాలిటీ చైర్మన్ శ్రీరామ్ చినబాబు అండతో వార్డులో తాగునీరు,వీధిదీపాలు,రోడ్లు,మురుగు నీటి కాలువలు,మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి సేవలందిస్తామని హామీఇచ్చారు.కౌన్సిలర్ అభ్యర్థి ఇడగొట్టి మల్లీశ్వరి మాట్లాడుతూ రెండవ వార్డు ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించడానికి తాను కౌన్సిలరుగా పోటీ చేస్తున్నానని,ప్రజలు తనను ఆశీర్వదించి కౌన్సిల్ కు పంపితే వార్డు సమస్యలను పరిష్కరించేందుకు పునరంకితం అవుతామన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,టిడిపి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి